Chandrullo Unde

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
తందానే తందానే
నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట
ఏవంట
నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా... ఓ...

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా

ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో
ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో

హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్
యువర్ నేమ్ ప్లీజ్ - స్టెల్లా
స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్
కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్
రేయ్ రేయ్ రేయ్...
ఓ... కమింగ్ డాడ్

గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ...

హే గగగా రిగ రిసాస సానినిస
గగగా రిగ రిససా...

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవాCredits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Seetha Rama Shastry, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link