Ra Ri Ro Rela

రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
సూడవే సుక్క సూడవే .
నా బిడ్డ దిక్కు సూడవే
సందమామ లెక్క ఉంటదే .
దీని అంద సందమెంతో సుడవే
నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమంది కుండ
నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమంది కుండ
సుక్క ఈ కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీపాట సల్లంగ ఉండ నీ బతుకుల సిరునవ్వు పండ
సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరింది నా మగ్గం ఇయాల
సుక్క సేనేత సప్పుల సంగీతమవ్వాల సందెళ్లు తేవాలా సంబరాల తేలాలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
సూరీడి వెలుగు తప్ప ఇంకేది మాకు తెల్వదే ఏముందో నీలో గొప్ప నీకెల్లి మనసొంగినాది
ఆ సన్న సన్నని రాగాలలో మా సున్నితాలు కలుపుకోవే నీ పుణ్యముంటది
కిలకిలల కు కు కు కిలకిలల కు కు కు అంటూ మా కూత నీ నోట రావాల
గల గళ్ళ హైలెస్స గల గళ్ళ హైలెస్స అంటూ నాగుండె సవళ్ళు నువ్వే పలకాల
పల్లె తల్లి నడుగుతుండా బిడ్డ.
పల్లె తల్లలనడుగుతుండా
ఆ లొల్లాయి నా మీద అల్లాల .
ఓ లొల్లాయి నా మీద అల్లాల
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
నేలమ్మ కన్నదంట నిన్నైన నీబిడ్డ నైన ఈ నేలమ్మ ఇచ్చిందంట నీరైన నీకుండనైన
గువ్వల కూతకి ఆయువు పోసిన గింజల నిచ్చింది నేలమ్మె
తనలోని పల్లాలు నది కోసం ఉంచింది ఎన్నేన్నొ పరువళ్ళు నేర్పింది
పల్లె తల్లి నువ్వు వనవే .
ఇది గాలి లొల్లాయ్ ఐతే కాదే
మన రాజన్న చెప్పిన మాటే ఆ నేలమ్మ నీ ముద్దు పేరే
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా

Credits
Writer(s): M.m. Keeravaani, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link