Chilakamma Palikindi

చిలకమ్మ పలికిందీ
చిగురాకు కులికిందీ
చిలకమ్మ పలికిందీ
చిగురాకు కులికిందీ
చిరునవ్వు చిలికించవే
నీ లేత సింగార మొలికించవే
నీ లేత సింగార మొలికించవే

గోరొంక కూసింది
గోరింట పూసిందీ
గోరొంక కూసింది
గోరింట పూసిందీ
ముత్యాల మనసీయ రా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా

పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ
ఈ సిగ్గు బరువు నేనోపలేను
ఈ సిగ్గు బరువు నే నోపలేను
నీ కంటి పాపలో దాచుకో నన్నూ
దాచుకో నన్నూ

చిలకమ్మ పలికిందీ
చిగురాకు కులికిందీ
ముత్యాల మనసీయ రా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా

కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ
కొండ వాగుదూకితే తెలిసిందీ కోడె వయసు పోగిందనీ
ఈ వయసు హోరు నేనాపలేను
ఈ వయసు హోరు నేనాపలేను
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ
దోచుకో నన్నూ

చిలకమ్మ పలికిందీ
చిగురాకు కులికిందీ
గోరొంక కూసింది
గోరింట పూసిందీ
చిరునవ్వు చిలికించవే
నీ లేత సింగారమొలికించవే
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా



Credits
Writer(s): Satyam, Narala Rami Reddy
Lyrics powered by www.musixmatch.com

Link