Kammani Vodi Bommani

కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
గొడుగులో రాగం ... అడుగులో తాళం
నిషాలలో వేసేయ్ బాణం
రసాలలో త్రుణం పణం
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే

మిడిసి పడకే తొలి సొగసు మొగలి పూ రేకా
కసా బుస కసా కసిగా
పడగ విడిచి విరి పడక పరుచుకున్నాగా
పగ వగా ఇదే పదరా
చినుకు పడి చీర జారే ... మెరుపు మెడ హార మేసే
ఉరుము జతిలో నడుము లయలో చలో లేలో
తడిసే నీ రూపం ... తళుకులో దీపం
వయస్సులో వానే వస్తే ... తడి స్వరం చలి జ్వరం
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే

గుబులు గుబులు మొదలగులు పెరిగే వొళ్ళంతా
సడే మియా తడి పొడిగా
చిగురు పొగరు చెలి figure కెదిగి తుల్ళింతా
పదే పదే అదే పనిగా
జడ తడిసి జావళీలై మెడలగడ తాళ మేసే
ఇరుకు ఇరుకు ఉడుకు దుడుకు చలాకీలో
అడిగితే అందం ... అధరమే బంధం
అయోమయం ఆషాడంలో ప్రియా ప్రియం స్వయంవరం
కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే
చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే
గొడుగులో రాగం ... అడుగులో తాళం
నిషాలలో వేసేయ్ బాణం
రసాలలో త్రుణం పణం



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link