Marugela

మరుగేల మబ్బు ముసుగేల
ఓ చందమామ ఓ చందమామ
మనసున మల్లెలు విరిసిన వేళ
మమతల పల్లవి పలికిన వేళ
మౌనమె మోహనరాగం అయోవేళ
మరుగేల మబ్బు ముసుగేల
ఓ చందమామ ఓ చందమామ

మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా
చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా
కనుచూపులో చిగురాశలు
బరువైన రెప్పల్లో బందించకు
మది వీదిలో స్వప్నాలకి
సంకెళ్లు వేసేటి జంకెందుకు
ఊయలలూపే మ్రుదు భావాలు
ఊపిరి తీగను మీటే వేళ
మౌనమె మోహనరాగం అయోవేళ
మరుగేల మబ్బు ముసుగేల

కాంచన కాంతుల కాంక్షల బాట కనబడలేదా
కొమ్మల కూసిన కోయిల పాట వినబడలేదా
ఉలి తాకిన శిల మాదిరి
ఉలికి ఉలికి పడుతోంది యదలో సడి
చలి చాటునా మరుమల్లెకి
మారాకు పుడుతుందో ఏమో మరి
చెంతకు చేరే సుముహూర్తానా
ఆశలు తీరే ఆనందాన
మౌనమె మోహనరాగం అయోవేళ
మరుగేల మబ్బు ముసుగేల
చైతన్య



Credits
Writer(s): M.m Keeravani, Sirivennela Seetharamashastry
Lyrics powered by www.musixmatch.com

Link