Punnami Puvvai (From "Rudhramadevi")

పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగులు చెరలను విడిచి
ఆడునిడునై తలచి
ఆలుపెరగని మురిపెము పిలిచి
మధుర భావనల సుధల వాహినిగా
ఎగసిన హృదయముతో
పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా

నేల పైకి దూకే తొలి వాన ఆటలా
నింగి అంచు తాకే అలలోని పాటలా
మౌనం ఆలపించే నవరాగము ఏదో
ప్రాణం ఆలకించే ఆ ప్రానము ఏదో
కొండవాగులోని కొత్త అలజడిలో
గుండె పొంగుతున్న సందడిలో
బంధనాలు దాటి చిందులాడు ఒడిలో
కింద మీదు లేని తొందరలోనే
నేనేనా నిజంగానా అనే భావం కలిగే
పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా

సొంత సోయగాలి బరువైనా మిన్నల్లో
వింత సౌరభాలే చిలికించు శ్వాసలో
ఉయ్యాలూపు గాలే లే లెమ్మనదా
వయ్యారాల కేళి రా రామ్మన్నదా
ఇంత కాలమెన్ని సొంపుల శిల్పము
శిల వెనకలే దాగుందా
ఇప్పుడేదో వింత స్వప్ప సంకల్పం
ముని పిలుపుగా తగిలిందా
సంకోచాల సంకెళ్లన్ని తృటిలో కరిగి
పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా
అరమరికలు మరచి
తెరమరుగులు చెరలను విడిచి
ఆడునిడునై తలచి
ఆలుపెరగని మురిపెము పిలిచి
మధుర భావనల సుధల వాహినిగా
ఎగసిన హృదయముతో
పున్నమి పువ్వై వికసిస్తున్నా
వెన్నెల గువ్వై విహరిస్తున్నా



Credits
Writer(s): Ilayaraja, Seetharama Sasthri
Lyrics powered by www.musixmatch.com

Link