Ranga Ranga Rangasthalaana

రంగా రంగా రంగస్థలానా...
రంగా రంగ రంగస్థలానా...
ఇనబడేట్టు కాదురా కనబడేట్టు కొట్టండెహే

రంగా రంగా రంగస్థలాన
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
రంగా రంగా రంగస్థలాన
ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
కనపడని సెయ్యేదో ఆడిస్తున్నా
ఆట బొమ్మలం అంట
వినపడని పాటకి సిందాడేస్తున్నా
తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు హొయ్య

రంగా రంగా రంగస్థలాన
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట

గంగంటే శివుడి గారి పెళ్ళాం అంట
గాలంటే హనుమంతుడి నాన్న గారట
గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన వాళ్లు కనికరించాలంట
వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంట
శూలమంటె కాళికమ్మఆయుధమంట
పాట పాడడానికైన పోటు పొడవడానికైన వాళ్లు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట

రంగా రంగా రంగస్థలాన
రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు హొయ్య

పది తలలు ఉన్నోడు రావణుడంట
ఒక్క తలపు కూడ చెడు లేదే రాముడి కంట
రామ రావణుల బెట్టి రామాయణం ఆట గట్టి
మచి చెడుల మధ్య మనని పెట్టారంట
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట
దయలేని వాడు యమధర్మరాజట
వీడి బాట నడవకుంటె వాడి వేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట
రంగా రంగా రంగస్థలాన
ఆడడానికంటె ముందు సాధనంటు సెయ్యలేని
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట
ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట

డుంగురు డుంగురు డుంగురు
డుముకోడుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు
డుముకో డుంగురు డుంగురు డుంగురు హొయ్య



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link