Govullu Thellana

గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
ఎందుకుండవ్
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
ఏమో
తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా
ఈ పొద్దు గడిచేనా
ఎందువలనా అంటే అందువలన
ఎందువలనా అంటే దైవఘటన

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలూ
పాపం
అల్లన మోవికి తాకితే గేయాలూ
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా
ఆ కలిమి చూసేనా
ఎందువలనా అంటే అందువలన
ఎందువలనా అంటే దైవఘటన

గోవుల్లు
తెల్లన
గోపయ్య
నల్లన
గోధూళి
ఎర్రన
ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link