Rangamma Mangamma (From "Rangasthalam")

ఓయ్ రంగమ్మా మంగమ్మా
ఓయ్ రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
గొల్లభామ వచ్చి, నా గోరు గిల్లుతుంటే
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫ్ అమ్మా ఉఫ్ అమ్మా అంటూ ఊదడు
ఉత్త మాటకైనా నన్ను ఊర్కోబెట్టడు
ఉఫ్ అమ్మా ఉఫ్ అమ్మా అంటూ ఊదడు
ఉత్త మాటకైనా నన్ను ఊర్కోబెట్టడు
ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే
మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే
మంటమ్మా మంటమ్మా అంటే సూడడు
మంచి నీళ్లైనా సేతికియ్యడు
మంటమ్మా మంటమ్మా అంటే సూడడు
మంచి నీళ్లైనా సేతికియ్యడు

ఓయ్ రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు

రామసిలకమ్మా, రేగి పండు కొడుతుంటే
రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే
రామసిలకమ్మా రేగి పండు కొడితే
రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడడూ
మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మారకమ్మా అంటే సూడడూ
మారు రైకైనా తెచ్చి ఇయ్యడు

రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు

నా అందమంత మూట కట్టి
అరె కంది సేనుకే ఎళితే
ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే
నా అందమంత మూట కట్టి కంది సేనుకెళితే
కందిరీగలొచ్చి నన్ను సుట్టుమూడుతుంటే
ఉష్ అమ్మా ఉష్ అమ్మా అంటూ తోలడు
ఉలకడు పలకడు బండ రాముడు
ఉష్ అమ్మా ఉష్ అమ్మా అంటూ తోలడు
ఉలకడు పలకడు బండ రాముడు

రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link