Orayyo (From "Rangasthalam")

(ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా)

ఈ సేతితోనే పాలు బట్టాను
ఈ సేతితోనే బువ్వ బెట్టాను
ఈ సేతితోనే తలకు బోసాను
ఈ సేతితోనే కాళ్ళు బిసికాను
ఈ సేతితోనే పాడె మోయ్యాలా
ఈ సేతితోనే కొరివి బెట్టాలా

(ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా)

ఈ సేతితోనే పాలు బట్టాను
ఈ సేతితోనే బువ్వ బెట్టాను
ఈ సేతితోనే తలకు బోసాను
ఈ సేతితోనే కాళ్ళు బిసికాను
ఈ సేతితోనే పాడె మోయ్యాలా
ఈ సేతితోనే కొరివి బెట్టాలా

(ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా)

మాకు దారి సూపిన కాళ్ళు కట్టెలపాలాయెనా
మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా
మా కలలు సూసిన కళ్ళు కాలి కమిలిపోయెనా
మమ్ము మేలుకొలిపిన గొంతు గాఢనిదురపోయెనా
మా బాధలనోదార్చ తోడుండే వాడివిరా
ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా

(ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా)

ఈ సేతితోనే దిష్టి దీసాను
ఈ సేతితోనే ఎన్ను నిమిరాను
ఈ సేతితోనే నడక నేర్పాను
ఈ సేతితోనే బడికి బంపాను
ఈ సేతితోనే కాటికి బంపాలా
ఈ సేతితోనే మంటల గలపాలా

(ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా)

తమ్ముడు నీకోసం తల్లడిల్లాడయ్యా
సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా
కంచంలోని మెతుకు నిన్నే ఎతికేనయ్యా
నీ కళ్ళద్దాలు నీకై కలియజూసెనయ్యా
నువ్వు తొడిగిన సొక్కా నీకై దిగులుపడి సిలక-కొయ్యకురి బెట్టుకుందిరయ్యా
రంగస్థలాన...
రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా
వల్లకాట్లో శూన్యపాత్ర మొదలయ్యేనా
నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా
నువ్వెల్లొత్తానంటూ సెప్పేఉంటావురా
మా పాపపు సెవికది ఇనబడకుంటదిరా

(ఓరయ్యో నా అయ్యా
ఓరయ్యో నా అయ్యా)



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link