Ranga Ranga Rangasthalaana (From "Rangasthalam")

రంగ రంగ రంగస్థలాన
రంగ రంగ రంగస్థలాన
ఇనబడేట్టు కాదురా కనబడేట్టు కొట్టండెహే

రంగ రంగ రంగస్థలాన
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
(ఆట బొమ్మలం అంట)
(మనమంతా తోలు బొమ్మలం అంట)
రంగ రంగ రంగస్థలాన
ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
(ఆట బొమ్మలం అంట)
(మనమంతా తోలు బొమ్మలం అంట)
కనపడని సెయ్యేదో ఆడిస్తున్న
ఆట బొమ్మలం అంట
ఇనపడని పాటకి సిందాడేస్తున్న
తోలు బొమ్మలం అంట
డుంగురు డుంగురు డుంగురు
డుముకు డుంగురు డుంగురు డుంగురు
(డుంగురు డుంగురు డుంగురు)
(డుముకు డుంగురు డుంగురు డుంగురు హొయ్య)

రంగ రంగ రంగస్థలాన
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
(ఆట బొమ్మలం అంట)
(మనమంతా తోలు బొమ్మలం అంట)

గంగంటే శివుడి గారి పెళ్ళాం అంట
గాలంటే హనుమంతుడి నాన్న గారట
గాలి పీల్చడానికైనా, గొంతు తడవడానికైనా
వాళ్లు కనికరించాలంట
వేణువంటే కిట్ట మూర్తి వాద్యం అంట
శూలమంటే కాళికమ్మ ఆయుధమంట
పాట పాడడానికైనా, పోటు పొడవడానికైనా
వాళ్లు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట
రంగ రంగ రంగస్థలాన
రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
(ఆట బొమ్మలం అంట)
(మనమంతా తోలు బొమ్మలం అంట)
డుంగురు డుంగురు డుంగురు
డుముకు డుంగురు డుంగురు డుంగురు
(డుంగురు డుంగురు డుంగురు)
(డుముకు డుంగురు డుంగురు డుంగురు హొయ్య)

పది తలలు ఉన్నోడు రావణుడంట
ఒక్క తలపు కూడ చెడు లేదే రాముడికంట
రామ రావణుల బెట్టి రామాయణం ఆట గట్టి
మంచి చెడుల మధ్య మనని పెట్టారంట
ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట
దయలేని వాడు యమధర్మరాజట
వీడి బాట నడవకుంటే వాడి వేటు తప్పదంటు
ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట
రంగ రంగ రంగస్థలాన
ఆడడానికంటే ముందు సాధనంటు సెయ్యలేని
ఆట బొమ్మలం అంట
మనమంతా తోలు బొమ్మలం అంట
(ఆట బొమ్మలం అంట)
(మనమంతా తోలు బొమ్మలం అంట)
డుంగురు డుంగురు డుంగురు
డుముకు డుంగురు డుంగురు డుంగురు
డుంగురు డుంగురు డుంగురు
డుముకు డుంగురు డుంగురు డుంగురు హొయ్య



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link