Banti Chamanti - From "Abhilasha"

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి, ఇద్దరినీ కలవమని
నిద్దరనే సెలవడిగి, ఇద్దరినీ కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

తేనెవాగుల్లో మల్లెపూలల్లే తేలిపోదాములే
గాలివానల్లో మబ్బుజంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురైపోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే, వెన్నెల్లు తేవే

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి, ఇద్దరినీ కలవమని
నిద్దరనే సెలవడిగి, ఇద్దరినీ కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

తారత్తా తరతా తరతా
తారత్తా తరర తరరా

పూతపెదవుల్లో పుట్టుగోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్రఎర్రంగా కుర్రబుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటైపొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరినీ కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరినీ కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link