Tella Cheeraku

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మా జంట ముద్దుల్లో
అవే తియ్యని సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై
మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మా జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో

వైశాఖం తరుముతుంటే
నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే
నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే
నీతోడు కావాలి నే తోడుకోవాలి
నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లి సూరీడూ ఆకాశంలో
నిండిన సొగసులు
తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మా జంట ముద్దుల్లో

కార్తీకం అహ్ కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా
హేమంతం ఒహ్ కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు
పలికాయి నా స్వప్నసంగీతమే
ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు
వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే గీతాలై సింగారానికి
సిగ్గులు కలిపిన
తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మా జంట ముద్దుల్లో
అవే తియ్యని సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు
రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ
తాకేనమ్మా జంట ముద్దుల్లో



Credits
Writer(s): Veturi, Jonnavitthula, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link