Devullemechindhi

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ మనసంతా వెలిగించి నిలిపేనిదీ సరిరాని ఘనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరథ రాజు అతని కులసతులు గుణవతులు ముంగురు
పుత్రకామ యాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రగువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌషికు డేతించెనూ
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే రాముడే ధీరుడై తాటకిని చంపే
యాగమే సఫలమై కౌషిక ముని పొంగే
జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే
శివధనువదిగో నవవధువిదిగో రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందరవదనం చూసిన మధురం నగుమౌమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే

నీ నీడగ సాగునింక జానకీయని
సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్సకి ఆలపించే అమ్రుత రాగమే
రామాంకితమై హృదయం కలిగే సీతకీ
శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని
ఆజానుబాహుని జతకూడే అవని జాత
ఆనంద రాగమే తానాయే హృదిమి సీత
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

సాహిత్యం: జొన్నవిత్తులCredits
Writer(s): Ilayaraja, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link