Mandara

మందార పువ్వంటి మనసున్న మారాజ
అందిందా నా కానుక ఓ... అందించా మనసాగక

మరుమల్లె పువ్వంటి మనసున్న మారాణి
అందిందే నీ కానుక ఓ... అందాల నా మేనక

జతలోన పాలించే నువ్వే జగమేలే వాడయ్యాక
ఎదలోన చోటిచ్చే నువ్వే నా మేలే ఆశించాక
సరదాలు వెల్లివిరిసాక
సరసాల జల్లు కురిసాక
ఒకసారిగా వరమాలలే నిలువెల్లా అల్లుకున్నాక
అందిందా నా కానుక ఓ... అందించా మనసాగక

ఎటువైపు చూస్తూ ఉంటున్నా అటు నువ్వే కనిపించాక
బ్రతుకంతా నీతో ఉంటాగా - అని నువ్వే మాటిచ్చాక
హృదయాలు రెండు మురిసాక
నయనాల ప్రేమ మెరిసాక
గత జన్మలో అనుబంధమే విడిపోని బంధమేసాక
అందిందే నీ కానుక ఓ... అందాల నా మేనక
మందార పువ్వంటి మనసున్న మారాజ
అందిందా నా కానుక ఓ... అందించా మనసాగక



Credits
Writer(s): Ananth Sriram, S. Chinna
Lyrics powered by www.musixmatch.com

Link