Prathi Nijam Pagatikalaga

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా

పెదవులు మరచిన చిరు నగవై నిను రమ్మని పిలిచానా
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ
కరగకుమా నా కన్నులనే వెలి వేసి

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా

ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక
శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link