Yegire Yegire

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో
ఎవరే ఎవరే ఎదలో మథనమెందుకో
తననే వెతికే క్షణమే మధురం
పరుగై కరిగే సమయం
తనుగా ఎదురై కలిసే తరుణం
అలుపే అనక మొదలే తొలిపయనం

ఉన్నట్టుండి నువ్వు నా ముందుకొచ్చావు
అర్థం కాని సందేహంలోకి నెట్టావు
నన్నే నీలోనే ముంచావులే, మైమరపే పెంచావులే

నిన్నమొన్నల్లోన నా లోకమే వేరు
నీ రాకతో మారిపోయింది నా తీరు
నేడే నీవల్లే చూశానులే సరికొత్త సంతోషాలు

పాదం తిరిగింది నీవైపుకే, ఆపే వీలేది లేక
కళ్లే మొలిచాయేమో మనసుకే
ఎన్నడూ ఎదురు చూళ్లేని ఈ తొందరేమిటో
తడబాటేమితో, వింతగా ఉంటుందేమిటో

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో

నీ మాటల్నే ఏదో మంత్రంలా వింటాను
చుట్టూ అంతా మరచి చిత్రంగా చూస్తాను నిన్ను
ఊహల్లోనే ఉంటాను, నిను దాటి పోనే పోను

నింగే తాకిందేమో సంబరం, నిన్నే చేరాలనేమో
నీతో ఉంటేనే నాకో వరం
ఎవ్వరూ తెలుసుకోలేని ఈ భాష నాదని
అది ప్రేమే అని, నా పని తనతోనే అని

ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో



Credits
Writer(s): Purna Chary, Ron Ethan Yohann
Lyrics powered by www.musixmatch.com

Link