Muddimmindi

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి

ముందరున్న ముద్దరాలి ముద్దు. చెల్లిద్దు. ఇటు చూద్దూ
మండుతున్న మోహనాంగి మత్తు... కలిగిద్దు. ఇటు రద్దు
పెదవి పొడుపు కథ విప్పేద్దు... చెప్పేద్దు గుట్టు
అదుపు పొదుపు ఇక చాల్లెద్దు... చంపేద్దు బెట్టు
అనువైన అందుబాటు చూడమంది
ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి

వేడి వేడి ఈడు ఊదుకుంటూ చవి చూద్దూ... చెలి విందు
వేడుకైన జోడు చూడమంటూ జరిపిద్దు... జడ కిందు
నిదర నదిని కసుకందేలా కరిగిద్దు. పొద్దు
మదన పదవి మనకందేలా చెరిపేద్దు. హద్దు
సడిలేని సద్దుబాటు చేయమంది

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి
చలి రాతిరిలో జత జాతరలో ఎటు పోను జాబిలి
రహదారులన్నీ తారలైన వేళ

ముద్దిమ్మంది ఓ చామంతి
మనసిమ్మంది ఓ పూబంతి



Credits
Writer(s): M.m. Keeravaani, Sirivennala Seetharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link