Pannendella Praayam

పన్నెండేళ్ళ ప్రాయం, వెన్నెల్లాంటి హృదయం,
ఎన్నాళ్లైన మరుపే రావుగా
సంతోషాల సమయం, పంతాలైన మధురం,
సొంతం కాని ఎదలే లేవుగా
కాసేపు ఆ జ్ఞాపకాలన్ని ఎదురైతే, నీ రూపు ఆ చోట పసిపాపై తోస్తుంది
కథలా కదిలే కాలంలోన అన్నీ వింతలే
చెలిమే చిలికే కళ్ళల్లోన కలవా చింతలే
అదిగో తేనెటీగల్లె తాకింది ఆ చల్లగాలి
అపుడే తేనెతీపంతా నన్నందుకోమంది వెళ్ళి

పన్నెండేళ్ళ ప్రాయం, వెన్నెల్లాంటి హృదయం,
ఎన్నాళ్లైన మరుపే రావుగా
సంతోషాల సమయం, పంతాలైన మధురం,
సొంతం కాని ఎదలే లేవుగా

చెరువుల్లో ఈత, ఇసకల్లో రాత,
తిరణాల్లో ఆడే సైయ్యాట
గుడిలోని పాట, తూనీగల వేట,
బడిలో నేర్పించే బతుకాట
చిననాటి స్నేహాల చిగురింతలే
ఎదిగేను ఈనాటి పులకింతలై
ఆ బొమ్మపెళ్ళిల్ల సందళ్లలో
ఈ బొమ్మకెన్నెన్ని తుళ్ళింతలో
నువు దాచాలి అనుకున్న వీల్లేదని తెలుసా

పన్నెండేళ్ళ ప్రాయం, వెన్నెల్లాంటి హృదయం,
ఎన్నాళ్లైన మరుపే రావుగా
సంతోషాల సమయం, పంతాలైన మధురం,
సొంతం కాని ఎదలే లేవుగా

మనపై జడివాన కురిసే నిమిషాన
పడవల తయ్యారీ గురుతుందా
మామిడికొమ్మల్లో కోకిలతో చేరి
కూసే కచ్చేరీ గురుతుందా
నినమొన్నే ఐనట్టు ఉన్నాయిలే
ఆ' నువు నాతో ఉండేట్టు చేశాయిలే
పాదాలు ఏ దారి నడిపించునో
ఏ ప్రేమ తీరాలు కనిపించునో
అడగాలంటూ నీ చెంత వాలిందిలా మనసు

పన్నెండేళ్ళ ప్రాయం, వెన్నెల్లాంటి హృదయం,
ఎన్నాళ్లైన మరుపే రావుగా
సంతోషాల సమయం, పంతాలైన మధురం,
సొంతం కాని ఎదలే లేవుగా



Credits
Writer(s): Ananth Sriram, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link