Are Maava Illaliki (From "Sundara Kaanda")

కోకిలమ్మ కొత్త పాట పాడింది
కూనలమ్మ కూచిపూడి ఆడింది
సందె పొద్దు నీడ అందగత్తె కాడ సన్నజాజి ఈల వేయగా
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
పక్క పాపిడెందుకో
పైట దూకుడెందుకే
మగడా ఎడ పెడ గడె పడగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ

పూల చెట్టు గోలపెట్టు తేనె పట్టులో నీ గుట్టు తీపిగున్నదీ
పైట గొప్పు బయట పెట్టు చేతి పట్టు నీ కట్టు జారుతున్నదీ
కొత్త గుట్టు కొల్ల గొట్టు coconut లో రాబట్టు కొబ్బరున్నదీ
దాచి పెట్టు దోచి పెట్టు చాకులెట్టులో బొబ్బట్టు మోతగున్నదీ
బుగ్గలు మొగ్గలై నువ్వు దగ్గరైతే విచ్చుకుంటనయ్యో
నచ్చినా గిచ్చినా నువ్వు ఇచ్చుకుంటే పుచ్చుకుంటనమ్మో
వరసే నీలో కలు కోలో అనగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ

కన్ను కొట్టు రెచ్చ గొట్టు కాక పట్టులో call sheey night కున్నదీ
పాలు పట్టు పండ బెట్టు పాని పట్టులో bed sheet బెంగపడ్డదీ
Bed light తీసి కట్టు good night లో కుర్ర ఈడు కుంపటైనదీ
ఉట్టి కొట్టు చట్టి పట్టు jack pot లో ఆటు పోటు అక్కడున్నదీ
ఒంపులో సొంపులో నిన్ను బొత్తుకుంటే మొత్తుకుంటవమ్మో
చెప్పినా చేసినా నీది కాని నాడు ఎక్కడుంటవయ్యో
అసలే చెలి ఆనార్కలి అనగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ
పక్క పాపిడెందుకో
పైట దూకుడెందుకే
మగడా ఎడ పెడ గడె పడగానే
అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ
ఓసోసి భామ బుగ్గలతో బూరెలు వండుకుందామ



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link