Idera Sneham (From "30 Rojullo Preminchadam Ela")

ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
కనివిని ఎరగని స్నేహం
ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం
నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం
తూర్పుకి పడమరకి కాంతి తోరణమయ్యిందీ స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
కనివిని ఎరగని స్నేహం
ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం

హో... మీ మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి
నీ పాదం తాకాలంటూ అలలైయ్యింది ఆ కడలి
తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి
నీ భారం మోసేటందుకే పుట్టానంది ఈ పుడమి
ఆశలూ ఆకర్షణలూ లేనిది మీ ఆడ మగ స్నేహం
నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం

హో... తన చూపులు నువ్ చూస్తుంటే నీ కలలను తను కంటోంది
తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది
తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు
నీలో నువు చెయ్యని పనులే నీలా తానే చేసేనే
జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం
దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఓ ఓ ఓ ఓ



Credits
Writer(s): Chandrabose, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link