Vinayaka

వినాయకాయ దేవరాయ
నిన్ను చేరి కొలుతుమయ్య
కాస్త కరుణ చూపు దేవర
గణాదిపా స్తుతింతు నిన్ను
చాలు చాలు కినుక మాని
ఎలుకనెక్కి ఇలను చేరరా
ప్రపంచ పాలకా
ప్రమోద కరకా
నిరంతరం స్మరింతు నిన్నే దేవా గణనాథా

సదా గళం మనం
స్తుతించి వెడలే
వరాల దేవ కరుణ చుపలేవా
గజాననా
గజాననా అనంత కరుణ చూపి మమ్ము కావర
జగాలు నిన్నే కొలిచెలే
అనంత రూప బ్రోవర

తరించు జీవితం భక్తి శాశ్వతం
గణేశ ఆశ శ్వాస మాకు నీవే
గణేశ్వరా
గణేశ్వరా సదా స్మరింతు నీదు సేవ భాగ్యమే
పరేశ్వరా ప్రపంచమంతా వేడి కోరె జ్ఞానమే

వినాయకాయ దేవరాయ
నిన్ను చేరి కొలుతుమయ్య
కాస్త కరుణ చూపు దేవర
గణాదిపా స్తుతింతు నిన్ను
చాలు చాలు కినుక మాని
ఎలుకనెక్కి ఇలను చేరరా
ప్రపంచ పాలకా ప్రమోద కరకా
నిరంతరం స్మరింతు నిన్నే దేవా గణనాథా

గజాననా
గణేశ్వరా
గణేశ్వరా
ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః



Credits
Writer(s): Somayajula Murthy, Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link