Padmavyuham

పద్మవ్యూహం లోనికి చొరబడి
బయటికి మరలే దారే లేదా
గద్దల తాకిడి తట్టుకు నిలబడి
నిర్దోషిత్వం రుజువే కాదా
పొద్దుట యుద్ధం పొడనే ఎరుగని
లోకం తెలియని గూడె విడువని
వాడే వీడే అభిమన్యుడు కాగా
కాలం పడగెత్తగా కౌర్యం కాటేయగా
దౌష్ట్యం దండెత్తగా
విధి ఎత్తిన కత్తికి దప్పి తీరునా
రౌద్రం శివమెత్తగా
రుద్రం చిందెయ్యగా
రుధిరం చిందించగా
ఇది విజయమో స్వర్గమో తేలిపోవునా

అమ్మా అన్న పిలుపే కవచం
కమ్మేసిన వైరి ప్రపంచం
ఆ తల్లిపై ఎంతటి భారం
నా వల్లనే ఇంతటి ఘోరం
నేరాలేవి చేయని వారిని
తీరం చేర్చు పూచి నాదని
నడిచే పిడుగై అడుగే పడని
ముడులే విడనీ
నడి రాతిరి రవివై పొద్దే పొడవగా

బాధే దిగమింగుకో యోధా విల్లందుకో
శస్త్రం సంధించుకో
బడబాగ్నులు చిందుతూ గురిని చీల్చుకో
సాహొ చెలరేగిపో వ్యూహం ఛేదించుకో
లక్ష్యం సాధించుకో
సుడిగాలై రేగుతూ గమ్యమందుకో



Credits
Writer(s): Arun Vemuri, Pravin Lakkaraju
Lyrics powered by www.musixmatch.com

Link