Naatakaala Jagathilo (From "Mondi Mogudu Penki Pellam")

నాటకాల జగతిలో
జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా
చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదూ
నింగిలో చేప ఉండదూ
నీటికి నీరే పుట్టదూ
నీకు ఈ బాధే తప్పదూ

పరువాల పాప, చెరువుల్లో చేప
నీరంతా కడిగేస్తున్నా
అది చూసి లోకం
విసిరేస్తే గాలం, గాలైన కాపాడేనా
విలువ బలైనా
జన్మకు శిలువ పడేనా
విధికి గులామై
ధర్మం తలవంచేనా
చేలైన మేసేటి కంచెలివేలే

నాటకాల జగతిలో
జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా
చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదూ
నింగిలో చేప ఉండదూ
నీటికి నీరే పుట్టదూ
నీకు ఈ బాధే తప్పదూ

అందాల చెల్లి, తన చంటి తల్లి
మానాలు మసిబారేనా
ఓనీకి రాణి, ఓ ఆడ ప్రాణి
సింగాల కసి చూసేనా
నరకమనేది ఇంటికి ముందు వసారా
శునకమనేది భర్తకు మిగిలిన పేరా
దెయ్యాలు వేదాలు పాడిన వేళ

నాటకాల జగతిలో
జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా
చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదూ
నింగిలో చేప ఉండదూ
నీటికి నీరే పుట్టదూ
నీకు ఈ బాధే తప్పదూ



Credits
Writer(s): Veturi Sundararama Murthy, M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link