Srivalli

నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయనే

అన్నిటికి ఎపుడూ ముందుండే నేను
నీ ఎనకే ఇపుడూ పడుతూ ఉన్నాను
ఎవ్వరికి ఎపుడూ తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను
ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే

చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే

నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తె
అయినా

చూపే బంగారమాయనే శ్రీవల్లి
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమాయెనే



Credits
Writer(s): Devi Sri Prasad, Varadaraj Chikkaballapura
Lyrics powered by www.musixmatch.com

Link