Daakko Daakko Meka

తందానే తనెననెనానే
తందానే తనెననెనానే
తానానే తన్నిననినానే
తానానే తన్నిననినానే
వెలుతురు తింటది ఆకు
(వెలుతురు తింటది ఆకు)
ఆకును తింటది మేక
(ఆకును తింటది మేక)
మేకను తింటది పులీ
(మేకను తింటది పులీ)
ఇది కదరా ఆకలి
(ఇది కదరా ఆకలి)
పులినే తింటది చావు
చావుని తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలి
వేటడేది ఒకటి
పరిగెత్తేది ఇంకొకటి
దొరికిందా ఇది సస్తాది
దొరక్క పోతే అది సస్తాది
(ఒక జీవికి ఆకలి ఏసిందా)
(ఇంకో జీవికి ఆయువు మూడిందే)

(హేయ్ దాక్కో దాక్కో మేక)
(పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్)

చేపకు పురుగు ఎరా
పిట్టకు నూకలు ఎరా
కుక్కకు మాంసం ముక్క ఎరా
మనసులందరికి బతుకే ఎరా
గంగమ్మ తల్లి జాతర
కోళ్లు పొట్టేల కోతరా
కత్తికి నెత్తుటి పూతరా
దేవతలకైనా తప్పదు ఎరా
ఇది లోకం తలరాతరా
ఏమరు పాటుగా ఉన్నావా
ఎరకే చిక్కేస్తావు
ఎరనే మింగే ఆకలుంటేనే
ఇక్కడ బతికుంటావు
కాలే కడుపు సూడదు రో
నీతి న్యాయం
బలం ఉన్నొడిదేరా
ఇక్కడ ఇష్టా రాజ్యం

(హేయ్ దాక్కో దాక్కో మేక)
(పులొచ్చి కొరుకుద్ది పీక హుయ్)

అడిగితే పుట్టదు అరువు (అరువు)
బతిమలితే బ్రతుకే బరువు (బరువు)
కొట్టరా ఉండదు కరువు (కరువు)
దేవుడికైనా దెబ్బే గురువు
తన్నులు సేసే మేలు
తమ్ముడు కూడా సెయ్యడు
గుద్దుడు సెప్తే పాఠం
బుద్ధుడు కూడా సెప్పడహె

తగ్గేదేలేయ్



Credits
Writer(s): Devi Sri Prasad, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link