Eeshwarude

భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే
భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే

దివిలో సైతం కథగా రాని విధిలీలే వెలిగెనే
నీకు నువ్వే దేవుడన్నా భావనంతా గతమున కథే
నిన్నుమించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే
కాలమూ విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే

రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే
రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే
రక్తదాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే
ఏది ధర్మం ఏది న్యాయం తేల్చువాడొకడున్నాడులే
లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే
ఏజన్మలో యే జన్మలో నీ పాపమో
ఆజన్మలోనే పాప పలితమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే

నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే
నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే

నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే
రాక్షసుడివో రక్షకుడివో అంతు తేలని ప్రశ్నవి నువే
వెలుగు పంచే కిరణమల్లే ఎదుగుతావో తెలియనికలే
ఏక్షణం ఏక్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే

ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే
సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే

Credits
Writer(s): Chirrantan Bhatt, Shreemani
Lyrics powered by www.musixmatch.com

Link