Prathi Udhayam

హే ప్రతి ఒక ఉదయము ప్రశ్నగా నే పుడుతుంటా
తెలిసిన బదులుతో నిండుగా బలపడుతుంటా
హే అడుగడుగడుగున తెలివికి పదునెడుతుంటా
బ్రతుకొక తరగని తృష్ణగా కదిళెలుతుంటా
పూర్తి కాని ఖాళీలాగే నేనుంటా
తీరిపోని సందేహాలే దారంతా
రోజూ కొత్త సంగతేదో సాధించే ధ్యాసలో ఉంటా

ఏ నిమిషం
ఏ విషయము నేర్పిస్తుందో
ఏ సమయం
ఏ వివరము వినిపిస్తుందో
ఆశగా అందనా విజ్ఞానం
ఏ విషయం
ఏ కలతను ఛేదిస్తుందో
ఏ వివరము
ఏ కొలతకు మందిస్తుందో
సేవకే వాడనా నాలో జ్ఞానం
జ్వలిస్తా ఆరిపోని ఈ శక్తిగా
ఫలిస్తా అంతులేని ఆసక్తిగా
జీవిస్తా అందమైన సంతృప్తిగా సదాCredits
Writer(s): Amjad Nadeem, Traditional
Lyrics powered by www.musixmatch.com

Link