Okkade Devudu

సబ్ కా మాలిక్ ఏక్ హై సబ్ కా మాలిక్ ఏక్ హై సబ్ కా మాలిక్ ఏక్ హై

ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
ఏసునే దైవమని తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు

కాషాయ ధ్వజమునెత్తి ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్లతో ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైనమని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు

రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలి
అది దేవదేవుని జాలీ...
పసిడి మేడనీ పూరి గుడిసనీ
బేధమెరిగి కురియబోదు వాన
అది లోకేశ్వరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ ఆలయాల
కొలువుదీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవ దేవుడు



Credits
Writer(s): M. M. Keeravani, Suddala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link