Datthathreyuni

దత్తాత్రేయుని అవతరణం
భక్త బౄంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం
సదానంద హృదయంగమం

దత్తాత్రేయుని అవతరణం
భక్త బౄంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం
సదానంద హృదయంగమం

అల ఒకనాడు అనంత
విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని
పార్వతి పరమేశుని అడిగిందీ

బ్రహ్మ మానస పుత్రుడైన
ఆ అత్రిమహాముని పత్ని
అనసూయా పరమ సాధ్వి అని
పలికెను ఉమాపతి

అది విని రగిలిన
ముగరమ్మలు అసూయ
జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగ
తమ తమ పతులను పంపిరి

(దత్తాత్రేయుని అవతరణం
భక్త బౄంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం
సదానంద హృదయంగమం)

అతిథి రూపములు దాల్చిన
మువ్వురు మూర్తుల నాసతి కొలిచినది
దిగంబరముగ వడ్డింపు మనిన
దిక్పథులను చూచీ
దిగ్భ్రాంతి చెందినది

కాల ముర్తులను
చంటి పాపలుగా మార్చి
వివస్త్రగా వెలిగినదీ
పరమ సాధ్వి పరమాత్మలకే
పాలు ఇచ్చి పాలించినది

పతులు పసి పాపలైరని తెలిసి
లక్ష్మి సరస్వతి పార్వతులు పరితపించిరీ
ఘొల్లుమనుచు పతి భిక్ష పెట్టమని
కొంగు చాచి ఆచించిరి

(అనసూయ పాతివ్రత్యంతో
పాలకులొకటిగా బాసిల్లిరి
తమ తమ పతులెవరో తెలియక
ముగ్గురమ్మలే మురడిలిరి)

ముగ్గురు మూర్తులను
ముగ్గురమ్మలకు ఇచ్చి
అనసూయ అత్త యైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అమ్ష
అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది

(దత్తాత్రేయుని అవతరణం
భక్త బౄంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం
సదానంద హృదయంగమం)

సృష్టి స్తితి లయ కరకులౌ
బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా

అన్ని ధర్మముల ఆలవాలముగ
ఆవు ప్రుష్టమున అలరగా
నాల్గు వేదముల నడవడిగా
నాల్గు శునకముల నానుడిగా

(సమర్త సద్గురు వంశమే
ఆ దత్తుని ఐదు వంశములై)
ధర వెలిగే, ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే, ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే, ధర్మ జ్యోతులుగా



Credits
Writer(s): M. M. Keeravani, Vedavyasa
Lyrics powered by www.musixmatch.com

Link