Lachulo Lachana

లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే ఎయ్

అరెరరె లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
(లచ్చులో లచ్చన్నా)
(ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో)
(బిచ్చగాళ్ల బతుకులాయే)
(లచ్చులో లచ్చన్నా ఏయ్)

అ ఏకనోడు పీకనోడు
జనం మొఖం దేకనోడు
(జనం మొఖం దేకనోడు)
ఎలక్షన్ల జీబులొచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి
(లెక్చరు మీద లెక్చరిచ్చి)
కాలనీ గట్టిచ్చినమని కానూను బలుకుతుండ్రు
(కానూను బలుకుతుండ్రు)
కోళ్లగూడు కొంపగట్టి కోట్లు మింగి కూసుండ్రు
(కోట్లు మింగి కూసుండ్రు)
దసరా పండగొచ్చిందని రాక రాక అల్లుడొస్తే
(రాక రాక అల్లుడొస్తే)
ఆలుమగలు ఇద్దరింట మసలరాదు మెసలరాదు
(మసలరాదు మెసలరాదు)
ఉచ్చబొయ్య పోదమంటే
ఉచ్చబొయ్య పోదమంటే పంచ పొంటి జాగుండదు
లచ్చులో లచ్చులో
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
(లచ్చులో లచ్చన్నా)
(ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో)
(బిచ్చగాళ్ల బతుకులాయే)
(లచ్చులో లచ్చన్నా)

ప్రజల వద్ద పాలనని
ఊరూరుకి తిరుగుతుండ్రు
(ఊరూరుకి తిరుగుతుండ్రు)
ఎన్నడు రానాఫీసరు గుడిసె ముందుకొచ్చిండు
(గుడిసె ముందుకొచ్చిండు)
కడుపులో సల్ల కదలకుండా
కారు మీద వచ్చిండు
(కారు మీద వచ్చిండు)
శ్రమదానం పేరుతోటి పలుగు పార పటిండ్రు
(పలుగు పార పటిండ్రు)
అంగిస్తరి జెడకుండా తట్ట నెత్తికెత్తుకుండ్రు
(తట్ట నెత్తికెత్తుకుండ్రు)
పేపర్లో ఫొటోలకి
పేపర్లో ఫొటోలకి ఫోజులిచ్చి దిగుతుండ్రు
లచ్చులో లచ్చులో
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా అరెరరెరరె

అరె సచ్చినోడి లగ్గానికి వచ్చిందే కట్నమని
(వచ్చిందే కట్నమని)
సందట్లో సడేమియా సందులోకి జారుతుండ్రు
(సందులోకి జారుతుండ్రు)
హర్షాదు బోఫార్స్ హవాలా దొంగలు
(హవాలా దొంగలు)
సూటు బూటులేసుకున్న సూటికేసు దొంగలు
(సూటికేసు దొంగలు)
సంచి కూడ చూపించని యూరియా దొంగలు
(యూరియా దొంగలు)
అందరు శకాహారులే
అందరు శకాహారులే రొయ్యల ముల్లేడబాయే
లచ్చులో లచ్చులో
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా ఏయ్

తప్పతాగి నా మొగుడు తన్నుడు గుద్దుడువెడితే
(తన్నుడు గుద్దుడువెడితే)
సంసారం ఈదలేక రోజూ చచ్చి పుడుతుంటే
(రోజూ చచ్చి పుడుతుంటే)
అమ్మలక్క లంత గలిసి
వాడ వాడ లొల్లి జేసి
(వాడ వాడ లొల్లి జేసి)
సర్కారులు గళ్ళవట్టి సార బందు పెట్టిత్తే
(సార బందు పెట్టిత్తే)
ఖజానాలు ఖాళీ అని జీతమివ్వలేమని
(జీతమివ్వలేమని)
శ్వేతపత్రమట్టుకోని
శ్వేతపత్రమట్టుకోని గల్లి గల్లి తిరిగుతుండ్రు
లచ్చులో లచ్చులో
హే లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో లచ్చన్నా
ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో
బిచ్చగాళ్ల బతుకులాయే
లచ్చులో
ఒరేయ్ లచ్చులో
అన్నో లచ్చులో (లచ్చన్నా)
లచ్చులో (లచ్చన్నా)
లచ్చులో (లచ్చన్నా)
లచ్చులో (లచ్చన్నా)



Credits
Writer(s): Vandemataram Srinivas, Gooda Anjaiah
Lyrics powered by www.musixmatch.com

Link