Idhedho Bagundhe (From "Mirchi")

కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే
రాటుగ సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే
లేటుగు ఇంతందాన్ని చూశానా అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుందే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటె నాకెంతో సరదాగుందే
ఆశలు రేపేడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యొ అనుకుంటునే
ఇలాగే ఇంకాసేపంటుంటే

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్న ఎదుటనే ఉన్న
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని
చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నై పోయానని

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మేను పూలగనీ
నలిగిపొతునే వెలిగిపొతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్ని
కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి నీకోసం ఎదైనా సరే

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి: మిర్చి: దేవి శ్రీ ప్రసాద్: విజయ్ ప్రకాష్, అనిత కార్తికేయన్



Credits
Writer(s): Devi Sri Prasad, Darivemula Ramajogaiah
Lyrics powered by www.musixmatch.com

Link