Endhuko

ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
ఎన్నడూ తెలియంది ఎందుకో
నాలో మొదలైంది ఎందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన నవ్వులోన సిరివానలోన విరికోనలోన చిరుతేనెలోన మునిగేందుకా
ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నేనే నాలాగ అస్సలు లేనెందుకో

ఆ ఊరు ఈ ఊరు వేరైనా
ఆకాశం అంతా ఒకటేగా
ఆ నువ్వు ఈ నేను యేడున్నా
ఆలోచనలన్నీ ఒకటేగా
ఊహలే పంపితే రాయబారం
ఊసులే చేరవా వేగిరం
ప్రేమలో చిన్నదే ఈ ప్రపంచం
అని తెలిసి కూడ తెగ అలజడాయె, ఆ తలపులోనే తలమునకలాయె మరి ఎందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన బాటలోన తన తోటలోన తన తోడులోన తన నీడలోన నడిచేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన తనువులోన అణువణువులోన మధువనములోన ప్రతికణములోన కలిసేందుకా
ఎందుకో తొలి తొందరెందుకో
నాలో ఎద చిందులెందుకో
నాకే ఇంతందమెందుకో మెరుపెందుకో
సొగసులకు ఈ రోజు బరువెందుకో
నడకలకు ఈ రోజు పరుగెందుకో
ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో
రేపటికి ఈ రోజు ఉరుకెందుకో
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన చూపులోన తన రూపులోన తన రేఖలోన శుభలేఖలోన వెలిగేందుకా
చెలికై ఇలా ఇలా అలై చలించా అందుకా
తన నవ్వులోన సిరివానలోన విరికోనలోన చిరుతేనెలోన మునిగేందుకా



Credits
Writer(s): Vishal Dadlani, Shekhar Hasmukh Ravjiani, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link