Puvvu Nachenu

పువ్వు నచ్చెను, తీగ నచ్చెను
భూమి నచ్చెను, మేఘం నచ్చెను
మురికి నచ్చెను అన్నీ తన వల్లే
నదులు నచ్చెను, నిప్పు నచ్చెను
వెన్నెల నచ్చెను, పిచ్చి నచ్చెను
ఇప్పుడు నచ్చినవన్నీ తన వల్లే
అందాల గాలి జల్లుతో తల భారం పట్టేసింది
తన చుట్టూ తిరుగుతున్నదే నా కంటి చూపు
చురుకైన తన చూపుల్తో చురకేదో వెయ్యంగానే
గుండెల్లో గుబులే పుట్టిందే
పడుకుంటే నిద్రపోయే కుర్రవాడు
పిచ్చి వాడిలా మారిపోతున్నాడే
తెల్లారి లేచి పనికి వెళ్ళేవాడు
పొద్దెక్కినా పనిని మరిచినాడే
పువ్వు నచ్చెను, తీగ నచ్చెను
భూమి నచ్చెను, మేఘం నచ్చెను
మురికి నచ్చెను అన్నీ తన వల్లే
నదులు నచ్చెను, నిప్పు నచ్చెను
వెన్నెల నచ్చెను, పిచ్చి నచ్చెను
ఇప్పుడు నచ్చినవన్నీ తన వల్లే

ఆ చూపులకే నే పూసితిని
ఆ నీడ పడి పులకించితిని
చినదానినని నిన్న తలచితిని
తన కన్నులలో వయసెరిగితిని
ఆ చూపులకే నే పూసితిని
ఆ నీడ పడి పులకించితిని
చినదానినని నిన్న తలచితిని
తన కన్నులలో వయసెరిగితిని

పువ్వు నచ్చెను, తీగ నచ్చెను
భూమి నచ్చెను, మేఘం నచ్చెను
మురికి నచ్చెను అన్నీ తన వల్లే
నదులు నచ్చెను, నిప్పు నచ్చెను
వెన్నెల నచ్చెను, పిచ్చి నచ్చెను
ఇప్పుడు నచ్చినవన్నీ తన వల్లే



Credits
Writer(s): Veturi, Joswa Sridhar
Lyrics powered by www.musixmatch.com

Link