Bhoonabhontaalake

(జయ జయ శంకర శివ శివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర)

భూనభోంతాలకే పులకింత రా
దశ దిశాంతలకే ఒక వింత రా
కదిలాడు ధరణికే కాంతిమయుడు
కరుణాంతరంగుడై ప్రణవధారుడు

(జయ జయ శంకర శివ శివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర)

జ్ఞాన ప్రభారాశి దివ్య త్రినేత్రం
వేద వేదాంతార్థ జోతిస్వరూపం
కైలాస శిఖరాలు నిజభుజస్కంధాలు
కరుణా సముద్రాలూ స్వామి కనులు

(జయ జయ శంకర శివ శివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర)

శిరసుపై చలువ ఆ చలువ గంగ
నుదుటికి తళుకు ఆ చంద్ర వంక
నెమలి పించము వోలు నీల కంఠం
చలి మబ్బులు విబూది భస్మం
(జయ జయ శంకర శివ శివ శంకర)

అభయ ప్రళయశక్తి ఆ త్రిశూలం
అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం
మణిభూషణం ఆయే సర్ప రాజ్యం
సంధ్య కాంతులనెగసె వ్యాఘ్ర చర్మం
(జయ జయ శంకర శివ శివ శంకర)

సప్త తాండవనటుల నటరాజు పాదం
బ్రహ్మాది దేవతలు మొక్కేటి పాదం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
(జయ జయ శంకర శివ శివ శంకర)

పాహి పాహి అనే పరమ భక్తుడే
ద్రోహి అంటూ నిందించగా
భూషణలు భూషణముగా చేసి కొనిచేరె
నాగభూషణుడైన నటరాజు తానే
(దైవం మానుష రూపేణా)



Credits
Writer(s): Devi Sri Prasad, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link