Vacchadu

హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
ఓ... ఎనుబోతు కొమ్ము ఏనుగు దంతం
నూరి చేసిన దొర వీడు

నెత్తురు పీల్చే దాహం దాహం
కత్తులు మోసే మొహం మొహం
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం
శత్రువు చావే లక్ష్యం లక్ష్యం

హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
ఓ... ఎనుబోతు కొమ్ము ఏనుగు దంతం
నూరి చేసిన దొర వీడు
హే వేంకాడు చేసిన సంకటి అంటే ప్రాణం ఇస్తాడు
యహ వంకరటింకర వేషాలేస్తే పేగులు కోస్తాడు
హే గందరగోల గొడవలు చేస్తే కత్తే దూస్తాడు
అరె వందల మందిని నీడకి చేర్చే చెట్టై కావలి కాస్తాడు
వచ్చాడు
హే... వచ్చాడు

ఎదురొచ్చినోడంటూ లేడు (లేడు)
ఎదిరించే వాడింక రాడు (రాడు)
కన్నెత్తి చూస్తేనే కత్తెత్తి పైకొచ్చి తెగ రెచ్చిపోతాడు వీడు (వీడు)
కడతాడు కస్సా పంచె (పంచె)
ఈడు కొడితే హైలెస్సా అంతే (అంతే)
ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడీకి కట్టని కంచె (కంచె)
హే కట్టెలు కొట్టే గొడ్డలి లాగ కస్సు మంటాడు
మరి మెట్టెలు పెట్టిన పెళ్ళాం ముందర మెత్తగుంటాడు
అరె చెట్టుని పుట్టని మట్టిని గట్టుని చుట్టం లాగే చూస్తాడు
వచ్చాడు
హే... వచ్చాడు
హే వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు
ఊరికి వీడే మొనగాడు
హే ఎనుబోతు కొమ్ము ఏనుగు దంతం
నూరి చేసిన దొర వీడు
నెత్తురు పీల్చే దాహం దాహం
కత్తులు మోసే మొహం మొహం
ఎత్తులు వేసే వ్యూహం వ్యూహం
శత్రువు చావే లక్ష్యం లక్ష్యం



Credits
Writer(s): Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link