Aamani (From "Geetanjali")

ఆమని పాడవే హాయిగా... మూగవైపోకు ఈ వేళ...
రాలేటి పూల రాగాలతో... పూసేటి పూల గంధాలతో...
మంచు తాకి కోయిల... మౌనమైన వేళల...

ఆమని పాడవే హాయిగా...
ఆమని పాడవే హాయిగా...

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కథ క్షణాలదే కదా
గతించిపోవు గాథ నేనని.!

ఆమని పాడవే హాయిగా... మూగవైపోకు ఈ వేళ...
రాలేటి పూల రాగాలతో...

శుకాలతో... పికాలతో... ధ్వనించిన మధూదయం
దివి భువి... కలా నిజం... స్పృశించిన మహోదయం

మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోని గాథ నేనని...!
ఆమని పాడవే హాయిగా... మూగవైపోకు ఈ వేళ...
రాలేటి పూల రాగాలతో... పూసేటి పూల గంధాలతో...
మంచు తాకి కోయిల... మౌనమైన వేళల...

ఆమని పాడవే హాయిగా...
ఆమని పాడవే హాయిగా...



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link