Pacha Bottasi

పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా
వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర
చేయి నీ చేతిలో చేరగా రెక్క విప్పిందే నా తొందర
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

మాయగా నీ సోయగాలాలు వేసి
నన్నిలా లాగింది నువ్వే హలా
కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా
హత్తుకుపో నను ఊపిరి ఆగేలా
బాహు బంధాల పొత్తిళ్లలో విచ్చుకున్నావే ఓ మల్లిక
కోడె కౌగిళ్ల ఒత్తిళ్లలో పురి విప్పింది నా కోరిక
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా

కానలో నువు నేను ఒకమేను కాగా
కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా
మరుక్షణమే ఎదుర్తెనా మరణము కూడా పరవశమే
సాంతము నేనే సొంతము అయ్యాకా
చెమ్మ చేరేటి చెక్కిళ్లలో చిందులేసింది సిరివెన్నెల
ప్రేమ ఉరేటి నీ కళ్లలో రేయి కరిగింది తెలిమంచులా
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
జంటకట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దొరా

Credits
Writer(s): M. M. Keeravaani, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link