Bham Bham Bole

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ
(భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్)
(భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్)
(భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం)
(ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం)
(భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం)

వారణాసిని వర్ణించే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణిక
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక
నమక చమకాలై ఎద లయలే కీర్తన చేయగా
యమక గమకాలై పద గతులే నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే
మన కష్టమే తొలగిపోదా

ఎదురయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలాసంగా శివానందలహరి
మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link