Andaala Raakshsive

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా, బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బయిట పూసినా లోన కాసెడి శనగతోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా రామచిలకా
మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే

సూర్యుణ్ణి రెండు చేసి కళ్లలోన దాచుకుందు... అహా
చందురుని కంటిపాపలోన తాను ఉంచుకుందు
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా... అహా
మిణుగుర్లు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయా
తలగడగ నాకొక్క పంచె నువు ఈయవయా
కనుల కునుకే కలయా
చిలకా రామచిలకా
మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే

కొండపల్లి బొమ్మతోటి జంట చేరి ఆడుకుందాం (మొగలిపువ్వా)
కొండపల్లి బొమ్మతోటి జంట చేరి ఆడుకుందాం (మొగలిపువ్వా)

తేనెపట్టు పట్టుబట్టి పాడు చెయ్య శపధమా... అహా
ప్రేమంటే party విడిచి party మార్చు విషయమా
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులవుదువా... అహా
నే నడచు నీడలోన నీవుండ సమ్మతమా
నే కనక నీరైతే నీ నుదుటిపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కాని అన్నీ కలలే
చిలకా రామచిలకా
మొలకా ప్రేమ మొలకా
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా, బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బయిట పూసినా లోన కాసెడి శనగతోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా



Credits
Writer(s): A R Rahman, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link