Hey Naughty

Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా
ఆ నింగి దాకా నే పొంగుతున్నా
నేడో రేపో పెళ్ళి
నీ రూపే ruby
I love you baby
నీ రూపే ruby
I love you baby

ప్రేమల్లో అ ఆ లు, సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు, సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హే ప్రేమల్లో అ ఆ లు, సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను
చీరమ్మ అందాలు, సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
వరించి వస్తున్నా, వయ్యారమిస్తా
తపించిపోతున్నా చలాకి పిల్లా
కనులా మెరిసి కథలే తెలిసి సొదలే విరిసే
నీ రూపే ruby
I love you baby
నీ ప్రేమలేఖ నేనందుకున్నా
ఆ నింగి దాకా నే పొంగుతున్నా
నేడో రేపో పెళ్ళి
Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
Hey naughty love boy!

ఈ beauty నీదోయ్

కళ్ళల్లో నాట్యాలు, గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పద్యాలు, బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
కళ్ళల్లో నాట్యాలు, గుండెల్లో చేవ్రాలు ఏనాడో నువు చేశావు
పరువాల పద్యాలు, బరువైన పాఠాలు ఏనాడో నాకు నేర్పావు
వయస్సు నీతోనే వసంతమాడే
సుగంధరాగాల ఉగాది నేడే
ఎదలో మెదిలే సొదలే కథలే ముదిరి మనసే కుదిరే
Hey naughty love boy!
I love you baby
నీ ప్రేమలేఖ నేనందుకున్నా
ఆ నింగి దాకా నే పొంగుతున్నా
నేడో రేపో పెళ్ళి
Hey naughty love boy!
ఈ beauty నీదోయ్
నీ రూపే ruby
I love you baby



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link