Vinava Manavi (Male)

వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా
వినవా ప్రభువా

లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగుకోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా
వినవా మనవి యేసయ్యా
వినవా ప్రభువా

ఆశ ఏది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదతీర్చి సంతోషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా
వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం
పగిలెను జీవితం
చేసుకో నీ వశం
వినవా మనవి యేసయ్యా



Credits
Writer(s): Pranam Kamlakhar, Ar Stevenson
Lyrics powered by www.musixmatch.com

Link