Tooneega

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దూరంగా పోనికా ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక
తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా
ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక

దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలెయ్యకు సీతాకోక చిలుకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి
నీతో ఆడి
చందమామ అయిపోయాడుగా
తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక

ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటు వైపెళుతుంది మళ్ళీ ఇటు వైపొస్తుంది
ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి
మా ఊరుంది
ఉండిపోవే మాతో పాటుగా

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే రావే నా వంక
దూరంగా పోనికా ఉంటావా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక
తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా
ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link