Pellante Noorella Panta

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆ
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.
అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి కదిలావమ్మా
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ

మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు
మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు

మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు
మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు
అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా...

మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ
మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ

అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ. అలమటించుతారు
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ. అలమటించుతారు

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా...

మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా
మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా
ఎలా కుదురుతుందీ. ఇది ఎలా జరుగుతుందీ.

కలిమి కాదు మగువకు కావలసిందీ...
కలిమి కాదు మగువకు కావలసిందీ...
మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ
మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ.
మనువు కోరుకుందీ.

పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంట
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలని తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.
అడుగు ముందుకేశావమ్మా. అడుగు ముందుకేశావమ్మా
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ



Credits
Writer(s): A R Rahman, Vennelakanti Subbu Rajeswara Prasad
Lyrics powered by www.musixmatch.com

Link