Kanne Pilla Kashmiram

(అందాల గుమ్మడి పండు హో హో హో)
(అందాల గుమ్మడి పండు హో హో హో)
(కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మ)
(కన్నుగీటి మందారం అప్పజెప్పెనమ్మ)
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మ
కన్నుగీటి మందారం అప్పజెప్పెనమ్మ
మంచుల్లో మంచాలే వెయ్యరాదా
వెన్నెల్లో దీపాలే పెట్టరాదా
సాగింది మురిపాల ముద్దుల పాకం
రేగింది పరువాల పక్కల తాళం
ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం
నీ సావాసం చలిలో సంసారం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మ
కన్నుగీటి మందారం అప్పజెప్పెనమ్మ

సందెమబ్బు పైటేసి, చందమామ బయటేసి
వచ్చాక జంట జాతర
హో హో హో ఈడుకొద్ది ఈలేసి
సిగ్గులుంటే తోలేసి
తీయాలి ప్రేమ పాతర
హో హో హో పొద్దుల్ని మొద్దు నిద్దర
హో హో హో పోనివ్వు మెత్త మెత్తగా
కాని చూపెందుకో
నాతో ఊపందుకో
నా వయ్యారం పిలిచే పేరంటం
ఈ పువ్వుల్తో తెచ్చా నా అందం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మ
కన్నుగీటి మందారం అప్పజెప్పెనమ్మ

మల్లెపూల పక్కేసి మంచి గంధమిచ్చేసి
వేసేయి చాటు వంతెన
హో హో హో చెక్కాముక్క చెల్లించి
ఆకు వక్క అర్పించి, పుట్టించు తీపి యాతన
హో హో హో పువ్వల్లె ఉంది నా ఎద
హో హో హో నువ్వొచ్చి వాలు తుమ్మెద హో హో హో
నీలో ఏమున్నదో
నాలో శోధించుకో
నీ కౌగిట్లో కరిగే కాశ్మీరం
నీ నవ్వుల్లో వెలిగే కర్పూరం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మ
కన్నుగీటి మందారం అప్పజెప్పెనమ్మ
మంచుల్లో మంచాలే వెయ్యరాదా
వెన్నెల్లో దీపాలే పెట్టరాదా
సాగింది మురిపాల ముద్దుల పాకం
రేగింది పరువాల పక్కల తాళం
ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం
నీ సావాసం చలిలో సంసారం
(కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మ)
(కన్నుగీటి మందారం అప్పజెప్పెనమ్మ)



Credits
Writer(s): Veturi Murthy, Chakravarthy K
Lyrics powered by www.musixmatch.com

Link