Evvaridi Ee Pilupu

ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినది ఈ
నీలో పలికినది ఈ ఈ
నీవై వెలిగినది ఈ
నీలో పలికినది
పిలిచిన పిలుపెల్లా నాదలై ఆ మ్రోగినవి
ఆ రాగాలై సాగినవి
మానసవీణై వెలసినది

ఎవ్వరిది ఈ వీణా
ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ ఆ నాలోని నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ
నీలో పలికినది

చుక్కల్నీ ఒలిచీ చక్కంగా మలిచి నీ కంఠహారాన్ని చేయించనా ఆ ఆ
సూర్యుణ్ణి అడిగి కిరణాలు తొడిగి నీ ముంగిటే ముగ్గు వేయించనా ఆ ఆ
ప్రాణాలు ఐదు నీలోనా ఖైదై ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు నీలోనా ఖైదై ఆరోది నీవై జీవించనా
ఎవ్వరిది. ఈ వీణా
ఆ ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ ఆ నాలోని నీ భావమే

తనువెల్లా మనసై మనసెల్లా కనులై నెలలన్నీ దినమల్లే గడిపేయనా
నాకున్న రుచులు నీకున్నా కళలు కలబోసి ప్రతిరోజు విందివ్వవా
నేనివ్వగలది ఈ ఏ జన్మములది ఇక ముందు ఎంతో మిగిలున్నది
ఎవ్వరిది ఈ వీణా
ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ ఆ నాలోని నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ ఈ
నీలో పలికినది ఈ
నీవై వెలిగినదీ ఈ
నీలో పలికినది

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ: మానస వీణ: ఎం.ఎస్. విశ్వనాథన్: ఏసుదాస్, సుశీల



Credits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link