Ramachiluka

రామచిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీరాదు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీరాదు
మనువాడే పెళ్ళికొడుకెవరే

ఏరులాంటి వలపు ఎల్లువైన వగపు
ఎన్నెలంతా ఏటిపాలై ఎదురీతేనా
ఏరులాంటి వలపు ఎల్లువైన వగపు
ఎన్నెలంతా ఏటిపాలై ఎదురీతేనా
తుమ్మెదెవరో
తుమ్మెదెవరో రాక ముందే తుళ్ళిపడిన కన్నె గువ్వ
ఈడు కోరే తోడు లేక కుములుతున్న ప్రేమమొలకా

రామచిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీరాదు
మనువాడే పెళ్ళికొడుకెవరే

గొంతులోని పిలుపు గుండెలోని వలపు
తీగ తెగిన రాగమల్లే మూగబోయెనా
గొంతులోని పిలుపు గుండెలోని వలపు
తీగ తెగిన రాగమల్లే మూగబోయెనా
గోరువంకా
గోరువంకా దారివంక ఎన్నెలంతా తెల్లవారే
పూతలోనే రాలిపోయే పులకరింత ఎందుకింక

రామచిలకా పెళ్ళికొడుకెవరే
మాఘమాసం మళ్ళీరాదు
మనువాడే పెళ్ళికొడుకెవరే
రామచిలకా పెళ్ళికొడుకెవరే
రామచిలకా పెళ్ళికొడుకెవరే



Credits
Writer(s): Sathyam, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link