Manishai Puttinavadu

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మా...
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు.
ఇలవేలుపులౌతారు...
అడుగో అతడే వాల్మీకీ.
బ్రతకు వేట అతనికి.
అతిభయంకరుడు యమకింకరుడు.
అడవి జంతువుల పాలిటి.
అడుగో అతడే వాల్మీకీ
పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించి పోయేవేళా.
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు.
ఒక పక్షిని నేల కూల్చాడు.
జంట బాసిన పక్షి కంటపొంగిన గంగ తన కంటిలో పొంగ... మనసు కరగంగ...
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే.
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే...
కరకు బోయడే అంతరించగా.
కవిగా ఆతడు అవతరించగా...
మనిషి అతనిలో మేల్కొన్నాడు.
కడకు మహర్షే అయినాడు.
నవరసభరితం రాముని చరితం.
జగతికి ఆతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడూ...
మీలోనే వున్నాడు...
అక్షరమై మీ మనసు వెలిగితే...
మీలోనే వుంటాడు.
అందుకే...
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు.
ఇలవేలుపులౌతారు...

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం.
తిరుగులేని దీక్షకు అతడే ప్రాణం.
కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు.
బొమ్మ గురుతుగా చేసుకొని బాణవిద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలి
వచ్చి పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు.
ఎదుట నిలిచిన గురుని పదమంటి...
ఏమివ్వ గలవాడననే ఏకలవ్యుడు.
బొటనవేలిమ్మని కపటి ఆ ద్రోణుడు.
వల్లెయని శిష్యుడు...
చెల్లె ద్రోణుని ముడుపు.
ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు.
వేలునిచ్చి తన విల్లును విడిచి ఇలవేలుపుగా ఇల వెలిగాడు.
అందుకే...
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు.
ఇలవేలుపులౌతారు...
శబరి...
ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి.
ఆశ పరుగిడి అడుగు తడబడి రామ పాదము కన్నది...
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు.
కనుల నీరిడీ...
ఆ రామ పాదము కడిగినది శబరి...
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి.
కోరి కోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించే.
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా భావించిన రఘురాముండెంతటి ధన్యుడో...
ఆ శబరి దెంతటి పుణ్యమో.
ఆమె ఎవ్వరో కాదు సుమా.
ఆడపడుచు మీ జాతికి...
జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీనాటికి...
అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు.
నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులూ...
అందుకే...
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు.
ఇలవేలుపులౌతారు...



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link