Sankara Nada Sareera

శంకరా... నాదశరీరా పరా
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా నాదశరీరా పరా
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా

ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ, గాన విలక్షణ, రాగమే యోగమనీ
ప్రాణము నీవని, గానమే నీదని, ప్రాణమే గానమనీ
మౌన విచక్షణ, గాన విలక్షణ, రాగమే యోగమనీ
నాదోపాసన చేసిన వాడను... నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను... నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించరా
విని తరించరా
శంకరా నాదశరీరా పరా

వేదవిహారా హరా జీవేశ్వరా

శంకరా

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా
శంకరా నాదశరీరా పరా
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా శంకరా శంకరా



Credits
Writer(s): Sundara Rama Murthy Veturi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link