Ennenno Janmala Bandham

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేళ నిండును చెలిమి
ఓహో హో హో నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను
చేరనా ... చేరనా ... చేరనా
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ నేనుండాలి
ఓహో హో హో నీవున్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ... ఉండనీ... ఉండనీ
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను



Credits
Writer(s): Dasarathi, Rajan Nagendra
Lyrics powered by www.musixmatch.com

Link